ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో బుధవారం భక్తులు పోటెత్తారు. కొండ కిక్కిరిసిపోరుుంది. రాత్రి 8 గంటలకే అన్ని క్యూలు నిండిపోయాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా క్యూల్లోకి భక్తులను అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు కొందరు సామూహికంగా శంకుమిట్ట కాటేజ్ వద్ద క్యూ గేట్లను విరిచారు. మరికొం దరు రాళ్లతో తాళాలను పగుల గొట్టారు. క్యూలోకి దూసుకెళ్లారు. పోలీసు, భద్రతా సిబ్బంది అడ్డుచెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు.