తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి నామాల వివాదం రేగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్వామి తిరునామం అలంకరణలో ఉద్దేశ పూర్వకంగా పొరపాట్లు చేశారా? అనుకోకుండా చేశారా? అన్న విషయాన్ని తేల్చాలని ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామారావుకు శుక్రవారం పెద్ద జీయర్ స్వామి మౌఖికంగా ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతోంది.