'వైఎస్ఆర్ జనభేరి'లో భాగంగా సోమవారం సాయంత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏలూరు బహిరంగ సభలో పాల్గొననున్నారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గన్నవరం చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జగన్ ఈ రోజు సాయంత్రం ఏలూరు ఏఎస్ఆర్ గ్రౌండ్‌లో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.
Published Mon, Mar 3 2014 5:00 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
Advertisement