ముంబయి పేలుళ్ల సూత్రదారి ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి జ్యుడిషియలర్ రివ్యూ బోర్డు ముందు వాంగ్మూలం ఇచ్చారు. జిహాద్ పేరిట సయీద్ ఆయన అనుచరులు ఉగ్రవాదాన్ని వ్యాపింప జేస్తున్నారని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.