పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఈ నెల 2, 3 తేదీల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంన గర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారితే మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే కురిసిన కుండపోత, భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో చెరువులు, కుంటలు, జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి.