Bay
-
గడ్డకట్టే చలిలో డాన్స్ అంటే మాటలా...
రష్యా : రష్యాకు చెందిన నృత్యకారిణి ఒక నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నమ్మశక్యం కాని రీతిలో ఓ కళాత్మక నృత్యం (బలేరినా) ద్వారా తన నిరసనను తెలిపింది. మనం చలిలో నడవాలంటేనే వామ్మో అంటాం. అలాంటిది ఇల్మిరా బాగౌటినోవా (రష్యా)మంచు సరస్సు పైన పాయింట్ బూట్లతో గడ్డకట్టే ఉష్ణోగ్రతలో నృత్యాన్ని ప్రదర్శిస్తూ తన నిరసనను ఈ విధంగా తెలిపింది. ‘బటరేనాయ బే’ను కాపాడుకుందాం బాల్టిక్ గ్రెయిన్ టెర్మినల్ సంస్థ ‘బటరేనాయ బే’లో 5 బిలియన్ల రూబుల్ (477 మిలియన్ డాలర్లు) ఖర్చుతో టెర్మినల్ నిర్మాణానికి యోచిస్తున్నట్లు రష్యా టాస్ వార్తా సంస్థ గత సంవత్సరం ప్రచురించింది. దీంతో ఈ ప్రాంతం తన సహజ సిద్ధ సంపదని కోల్పోయే ప్రమాదం ఉన్నందున అక్కడి ప్రజలు పలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మద్దతుగా ఆమె ఈ నత్యాన్ని ప్రదర్శించింది. అనంతరం నృత్యనికి సంగీతాన్ని జత చేసి మారిన్స్కీ థియేటర్ ద్వారా ఆన్లైన్లో ఈ ప్రదర్శనను పోస్ట్ చేసింది. తన వంతు కృషిగా ఈ ప్రాజెక్ట్‌ను ఆపడానికి ప్రయత్నిస్తోంది. బేను సహజ స్థితిలోనే ఉంచేలనే డిమాండ్‌ను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చేరాలా ఆన్లైన్ పిటిషన్లో సంతకం చేయాలని బగౌటినోవా రష్యన్లను కోరారు. నిరసన వ్యక్తం చేస్తూ చేసిన నా నృత్యం ఈ ప్రాజెక్ట్‌ను ఆపగలిగతే మనం ఈ అద్భుతమైన ప్రాంతాన్ని కాపాడుకోగలుగుతాం. కానీ అది అంత సులభంగా జరుగుతుందని అనుకోనని ఆమె తెలిపింది. అయితే, అటువంటి నిర్మాణ అనుమతిలేవి జారీ చేయలేదని లెనిన్గ్రాడ్ ప్రాంతీయ కార్యాలయం వారు రాయిటర్స్‌కు తెలిపారు. ( చదవండి : రష్యాను అధిగమించిన భారత్..! ) -
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఈ నెల 2, 3 తేదీల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంన గర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారితే మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే కురిసిన కుండపోత, భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో చెరువులు, కుంటలు, జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. గత నెల 22 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం 39.7 మిల్లీమీటర్లు (ఎం.ఎం.) కాగా ఆ కాలంలో 166 ఎం.ఎం. నమోదైంది. ఏకంగా 318 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అదేకాలంలో నిజామాబాద్ జిల్లాలో 804 శాతం అధిక వర్షం కురిసింది. సాధారణంగా ఆ వారం రోజుల్లో నిజామాబాద్‌లో కురవాల్సిన వర్షపాతం 37.2 ఎం.ఎం.లు కాగా 336.1 ఎం.ఎం.లు కురిసింది. మెదక్ జిల్లాలో 633 శాతం అధికంగా వర్షం కురిసింది. ఆ జిల్లాలో ఆ వారంలో సాధారణంగా 36.2 ఎం.ఎం.ల వర్షపాతం ఉండాలి. కానీ ఏకంగా 265.3 ఎం.ఎం.లు నమోదైంది. -
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
-
పాలపుంతలో భారీ అగాథం!
భూమిపై ఎడారులు ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే.. అయితే అంతరిక్షంలోనూ ఎడారులు ఉంటాయా.. ఎడారిని పోలిన ప్రాంతం ఒకటి ఉందని అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు తేల్చారు. భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యభాగంలో భారీ అగాథం ఉందని, నక్షత్రాలు, గ్రహాలు, ఇతర ఖగోళ శకలాలు ఏవీ ఈ ప్రాంతంలో లేవని గుర్తించారు. ఈ ప్రాంతం దాదాపు 8వేల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉందని జపాన్, దక్షిణాఫ్రికా, ఇటలీలకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఎలాంటి నక్షత్రమూ, గ్రహమూ కొత్తగా ఏర్పడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పాలపుంత మధ్య భాంలో దాదాపు 150 కాంతి సంవత్సరాల వ్యాసం పరిధిలో కోటి నుంచి 30 కోట్ల సంవత్సరాల వయసున్న నక్షత్రాలు ఉన్నా... ఆ ప్రాంతం తరువాత ఈ నక్షత్ర ఎడారి ప్రాంతం విస్తరించి ఉందని సౌతాఫ్రికన్ లార్జ్ టెలిస్కోపు ద్వారా తాము జరిపిన పరిశీలనల ద్వారా ఇది స్పష్టమైందని వారు అంటున్నారు. -
నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి
-
ఎట్టకేలకు ఆమర్ షేకర్ విడుదలయ్యాడు...
అతడి పేరు... షేకర్ ఆమర్... అమెరికా ఖాకీల కర్కశత్వానికి బలై.. ఖైదీల పాలిట నరకంగా పేరున్న గ్వాంటనామో బే జైల్లో పదమూడేళ్ళుగా మగ్గిపోతున్న చివరి బ్రిటిష్ పౌరుడు. ఎట్టకేలకు విడుదలై.. లండన్ చేరుకున్నాడు. అతడు చేసిన నేరమేమిటో కూడ చెప్పకుండా 2001 లో అతడ్నిబంధించారు. అయితే ప్రస్తుతం అతడి విడుదల తర్వాత ఏమిటి అన్నవిషయంపై ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేవని 'డౌనింగ్ స్ట్రీట్' అంటోంది. సౌదీ జాతీయులైన ఆమర్ కుటుంబం లండన్ లో నివసిస్తోంది. అతడి భార్య బ్రిటిష్ కు చెందినది కావడంతో ఆమర్ లండన్ లో నివసించేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని యూకె ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. ఆమర్ విడుదలను ఆయన స్వాగతించారు. ఆమర్ కు నలుగురు పిల్లలు. లండన్ బిగ్గిన్ హిల్స్ విమానాశ్రయానికి చేరిన ఆమర్ కు ప్రస్తుతం 48 ఏళ్ళ వయసు. అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతడికోసం అంబులెన్స్ ను విమానాశ్రయానికి పంపించారు. అతడ్ని కలిసేందుకు వచ్చిన ఆమర్ మామ.. సయీద్ సిద్ధిక్... ఆమర్ విడుదల అద్భుతమన్నారు. నిజంగా మిరాకిల్ అని అభిప్రాయ పడ్డారు.