గడ్డకట్టే చలిలో డాన్స్‌ అంటే మాటలా... | Russian Ballerina Performs On Frozen Waters To Save Batareinaya Bay From Construction Project | Sakshi
Sakshi News home page

గడ్డకట్టే చలిలో రష్యా నృత్యకారిణి వినూత్న ప్రదర్శన

Published Wed, Mar 17 2021 4:38 PM | Last Updated on Wed, Mar 17 2021 10:02 PM

Russian Ballerina Performs On Frozen Waters To Save Batareinaya Bay From Construction Project  - Sakshi

రష్యా : రష్యాకు చెందిన నృత్యకారిణి ఒక నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నమ్మశక్యం కాని రీతిలో ఓ కళాత్మక నృత్యం (బలేరినా) ద్వారా తన నిరసనను తెలిపింది. మనం చలిలో నడవాలంటేనే  వామ్మో అంటాం. అలాంటిది ఇల్మిరా బాగౌటినోవా (రష్యా)మంచు సరస్సు పైన పాయింట్ బూట్లతో గడ్డకట్టే ఉష్ణోగ్రతలో నృత్యాన్ని ప్రదర్శిస్తూ తన నిరసనను ఈ విధంగా తెలిపింది. 
‘బటరేనాయ బే’ను కాపాడుకుందాం

బాల్టిక్ గ్రెయిన్ టెర్మినల్ సంస్థ ‘బటరేనాయ బే’లో 5 బిలియన్ల రూబుల్ (477 మిలియన్ డాలర్లు) ఖర్చుతో టెర్మినల్ నిర్మాణానికి యోచిస్తున్నట్లు రష్యా టాస్ వార్తా సంస్థ గత సంవత్సరం ప్రచురించింది. దీంతో ఈ ప్రాంతం తన సహజ సిద్ధ సంపదని కోల్పోయే ప్రమాదం ఉన్నందున అక్కడి ప్రజలు పలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మద్దతుగా ఆమె ఈ నత్యాన్ని ప్రదర్శించింది. అనంతరం నృత్యనికి  సంగీతాన్ని జత చేసి మారిన్స్కీ థియేటర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ప్రదర్శనను పోస్ట్ చేసింది. తన వంతు కృషిగా ఈ ప్రాజెక్ట్‌ను ఆపడానికి ప్రయత్నిస్తోంది. బేను సహజ స్థితిలోనే ఉంచేలనే డిమాండ్‌ను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చేరాలా ఆన్‌లైన్ పిటిషన్‌లో సంతకం చేయాలని బగౌటినోవా రష్యన్‌లను కోరారు.
నిరసన వ్యక్తం చేస్తూ చేసిన నా నృత్యం ఈ ప్రాజెక్ట్‌ను ఆపగలిగతే మనం ఈ అద్భుతమైన ప్రాంతాన్ని కాపాడుకోగలుగుతాం. కానీ అది అంత సులభంగా జరుగుతుందని అనుకోనని ఆమె తెలిపింది. అయితే, అటువంటి నిర్మాణ అనుమతిలేవి జారీ చేయలేదని లెనిన్గ్రాడ్ ప్రాంతీయ కార్యాలయం వారు రాయిటర్స్‌కు తెలిపారు.  ( చదవండి : రష్యాను అధిగమించిన భారత్‌..! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement