Hundreds arrested in anti-war protests in Russia: ఉక్రెయిన్‌పై దాడి పట్ల రష్యాలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 180 నగరాల మున్సిపల్ డిప్యూటీలు, 240 మంది జర్నలిస్టులు, 260 మందికి పైగా సైంటిస్టులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ లేఖలు రాశారు. ఇది వినాశనానికే దారి తీస్తుందని, రష్యాకు కూడా ఏ మాత్రమూ మేలు చేయదని మండిపడ్డారు. రష్యా పౌరులంతా ముక్త కంఠంతో పుతిన్ చర్యను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
వెయ్యి మందికి పైగా జనాలు గురువారం సాయంత్రం మాస్కో నగరంలో ’పుతిన్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ మన శత్రువు కాదు. యుద్ధం వద్దు. సిగ్గుచేటు’ అంటూ నినాదాలు చేశారు. అలాగే వేరే నగరాలలో కూడా నిరసనకారులు తమ ఆందోళనలు కొనసాగించారు. పుతిన్ చర్యను తప్పుబడుతూ పీటర్‌బర్గ్ వంటి ప్రాంతాల్లోనూ నిరసనలు వ్యక్తం చేశారు. రష్యాలోనే కాకుండా ఉక్రెయిన్ ఆక్రమణను ఖండిస్తూ రసనకారులు గురువారం టోక్యో నుంచి టెల్ అవీవ్ మరియు న్యూయార్క్ నగరాల్లోని బహిరంగ కూడళ్లలో, రష్యన్ రాయబార కార్యాలయాల వెలుపల ర్యాలీలు నిర్వహించారు.
అప్పుడే ఈ అనవసర యుద్ధాన్ని ఆపగలమని పేర్కొన్నారు. మాస్కోతో పాటు సెయింట్ పీటర్స్‌బర్గ్, సమరా, వోల్గోగార్డ్ తదితర నగరాల మున్సిపల్ డిప్యూటీలు లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. మరోవైపు యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో పలు చోట్ల ప్రదర్శనలు కూడా జరిగాయి. మాస్కోతో పాటు కనీసం మరో 24 నగరాల్లో ఆందోళనలు జరిగినట్టు సమాచారం. వీటిలో పాల్గొన్న కనీసం 167 మందిని పోలీసులు నిర్బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment