Surface Cycles
-
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఈ నెల 2, 3 తేదీల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంన గర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారితే మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే కురిసిన కుండపోత, భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో చెరువులు, కుంటలు, జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. గత నెల 22 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం 39.7 మిల్లీమీటర్లు (ఎం.ఎం.) కాగా ఆ కాలంలో 166 ఎం.ఎం. నమోదైంది. ఏకంగా 318 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అదేకాలంలో నిజామాబాద్ జిల్లాలో 804 శాతం అధిక వర్షం కురిసింది. సాధారణంగా ఆ వారం రోజుల్లో నిజామాబాద్‌లో కురవాల్సిన వర్షపాతం 37.2 ఎం.ఎం.లు కాగా 336.1 ఎం.ఎం.లు కురిసింది. మెదక్ జిల్లాలో 633 శాతం అధికంగా వర్షం కురిసింది. ఆ జిల్లాలో ఆ వారంలో సాధారణంగా 36.2 ఎం.ఎం.ల వర్షపాతం ఉండాలి. కానీ ఏకంగా 265.3 ఎం.ఎం.లు నమోదైంది. -
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
-
ఎల్‌నినో ఎల్లిపాయె.. లానినా రాకపాయె!
తటస్థ స్థితిలో వాతావరణం ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే రుతుపవనాలకు ఊపు: శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో హోరెత్తించిన ఎల్‌నినో కనుమరుగైంది. వాన లతో ముంచెత్తాల్సిన లానినా రాకకు మాత్రం ఇంకాస్త సమయం పడుతుందంటున్నారు వాతావరణ నిపుణులు! ప్రస్తుతం లానినా దశలోకి వెళ్లడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎల్‌నినో కానీ లానినా కానీ లేదని... తటస్థ స్థితి మాత్రమే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే లానినా రావాల్సి ఉన్నా.. తటస్థ స్థితి నుంచి నెల రోజుల్లో లానినా ఏర్పడుతుందని తెలిపింది. రుతుపవనాలపై ఎల్‌నినో, లానినాల ప్రభావం ఉంటుంది. రుతుపవనాలు వచ్చాక అవి వేగంగా ముందుకు కదలడానికి, వర్షాలు కురవడానికి లానినా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లానినా ఏర్పడ్డాక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. జూలై, ఆగస్టు నాటికి లానినా 26% నుంచి 52%నికి చేరుకోనుంది. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67%నికి, అక్టోబర్ చివరకు 71%నికి చేరుకోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవర్తనం లేకే ఆలస్యం.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులు కావస్తున్నా ఇంకా తెలంగాణలోకి ప్రవేశించలేదు. ఈ నెల 15 నాటికే రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఏపీని రుతుపవనాలు తాకినా బలహీనపడడంతో అక్కడ కూడా వర్షాలు కురవడం లేదు. కేరళ, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాల కారణంగా విసృ్తతంగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఊపందుకోలేదు. ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే తప్ప రుతుపవనాలు రావని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 17-18 తేదీల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఫలితంగా నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరో 4 రోజులు వర్షాలు మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం రామగుండంలో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.3, హన్మకొండ 39.7, నల్లగొండ 39.4, నిజామాబాద్ 39.3, ఖమ్మం 39.2, భద్రాచలంలో 39.0, హైదరాబాద్ 37.3, మెదక్ 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కోస్తాంధ్ర, తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీన్ని ఆనుకుని సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఇది ప్రస్తుతం నైరుతి దిశగా కదులుతోంది. మరోవైపు ఆంధ్రా తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోను, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవాకాశాలున్నాయని తెలిపింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని సోమవారం రాత్రి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం ఉదయానికి బలపడి అల్పపీడనంగా మారిందని, భూ ఉపరితలంపైనే అది కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉండడంతో దాని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గాలులే తప్ప భారీ వర్షాలకు అవకాశం తక్కువేనన్నారు. అయితే, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని కారణంగా రాష్ట్రంలో రానున్న 24గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, దక్షిణ కోస్తా పరిధిలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రా తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది మరింత బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలున్నాయి. గురువారం రాత్రి వాతావరణ పరిస్థితులు అందుకు అనుకూలంగానే ఉన్నాయి. అల్పపీడనం ఏర్పడితే రాష్ర్టంలో రానున్న 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతోంది. ద్రోణి, ఆవర్తనాల కారణంగా కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం కూడా కావలి, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయన్నారు. రాష్ట్రంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గుంటూరు జిల్లా రెంటచింతలలో 6 సెం.మీ, ప్రకాశం జిల్లా దర్శిలో 5, తుని, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నర్సాపురం, బాపట్ల ప్రాంతాల్లో 3సెం.మీ. వర్షం పడింది. రాయలసీమలో మంత్రాలయం, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో 3 సెం.మీ. చొప్పున వాన కురిసింది. తెలంగాణలోని నల్లగొండలో 11 సెం.మీ, నాగార్జున సాగర్‌లో 6, మధిరలో 3 సెం.మీ. వర్షం పడింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రానున్న 48 గంటల్లోగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.