కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్లో అఖిలపక్ష బృందం పర్యటన వివరాలను రాజ్ నాథ్ ఈ భేటీలో ప్రధానికి వివరించనున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్లు తీవ్ర ఉద్రిక్తతను రేపిన విషయం తెలిసిందే.