హుదూద్ పెను తుపాన్ పూడిమడక వద్ద తీరాన్ని దాటింది. ఆదివారం ఉదయం విశాఖపట్నం జిల్లా కైలాసగిరి వద్ద తీరం తాకిన తుపాన్ 12 గంటల ప్రాంతంలో తీరం దాటింది. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తుపాన్ పూర్తిగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూడిమడకతో పాటు సమీప గ్రామాల్లోకి సముద్రం నీరు వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గంటల్లో తుపాన్ బలహీనపడుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు తుపాన్ ప్రభావం ఉంటుందని చెప్పారు.
Published Sun, Oct 12 2014 2:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement