భారతి సిమెంట్స్ కేసులో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అత్యుత్సాహానికి ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ కేసులో స్థిర, చరాస్తులు, ఫిక్సడ్ డిపాజిట్ల ప్రాథమిక జప్తును సమర్థిస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ గత నెల 23న జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు సంబంధించి తదుపరి చర్యలేవీ తీసుకోవద్దంటూ మంగళవారం ఈడీని ఆదేశించింది. ఆ ఉత్తర్వులపై 45 రోజుల్లో అప్పీ లు చేసుకునే అవకాశమున్న నేపథ్యంలో... అప్పీలు దాఖలు చేసుకుని, స్టే పిటిషన్ పై నిర్ణయం వెలువడే వరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంది.
Published Wed, Dec 21 2016 7:28 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
Advertisement