ప్రధాని మోదీపై ఇమ్రాన్ఖాన్ ప్రశంసలు | imran-khan-praises-narendra-modi-over-black-money-issue | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 7 2014 3:14 PM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

పాకిస్థాన్ విపక్ష నాయకుడు ఇమ్రాన్ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని పొగిడేశారు. ఆయన గురించి ఎవరేం చెప్పినా.. ఆయన అత్యంత విశ్వసనీయుడని అన్నారు. ఒకప్పుడు క్రికెటర్గా ఉండి, తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ఖాన్.. పాకిస్థాన్లో కూడా నల్లధనాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. పాకిస్థాన్ నాయకుడు ఒకరు భారత నేతలపై ఇంతగా ప్రశంసలు కురిపించడం మాత్రం ఇదే తొలిసారి. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం 2013 ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు నెలనుంచి ఉద్యమిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement