ఆంధ్రప్రదేశ్‌లో కూచిపూడి నాట్యాన్ని ఆదరించడం చాలా సంతోషకరమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అంతర్జాతీయ నృత్యోత్సవాలు విజయవాడలోని ఇందిరాగాంధీ స్డేడియంలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని నిర్మించాలని కోరుతున్నామన్నారు. తెలుగు భాషను కూడా పరిరక్షించుకోవాలని జస్టిస్ రమణ పిలుపునిచ్చారు.
Published Fri, Dec 23 2016 12:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
Advertisement