మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా అధికార టీఆర్‌ఎస్ బలపరిచిన సిట్టింగ్ సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తిరిగి గెలుపొందారు. విజయానికి 9,670 ఓట్లు కావాల్సి ఉండగా, 11వ రౌండ్ పూర్తయ్యేప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో 9,734 ఓట్లు సాధించి నెగ్గారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చాక ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. గత ఎన్నికల్లో కూడా కాటేపల్లి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు!