teachers mlc
-
పోటీలో ఉండే వారికే బీఫారం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త వ్యూహం అమలుచేసే యోచనలో ఉంది. గత ఎన్నికలకు భిన్నంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని బరిలో దింపే విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రావడంలేదు. అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో ఎవరికీ బీఫారం ఇవ్వకుండా.. పోటీలో ఉండే వారి లో ఒకరిని బలపరచాలని భావిస్తోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కరికి టికెట్ ఇవ్వడం వల్ల మిగిలిన అభ్యర్థులను బలపరిచే సంఘాలు దూరమవుతాయని, దీనివల్ల లోక్స భ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది ఉంటుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఎమ్మెల్సీ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం నెలకొంటుందని యోచిస్తోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్... వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 5న నామినేషన్ల ప్రక్రియ ముగి యనుంది. 22న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి పాతూరి సుధాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి పూల రవీందర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది. 2013లో ఈ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పాతూరి టీఆర్ఎస్ అభ్యర్థిగా, రవీందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం రవీందర్ టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు వీరిద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. వీరికి పోటీగా ఉపాధ్యాయ సంఘాల తరఫున పలువురు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఇలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. టీఆర్ఎస్ అవకాశమిచ్చి నా, ఇవ్వకున్నా పోటీలో ఉంటామని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇప్పటికే నిర్ణయించుకున్నా రు. దీంతో టీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఎవరో ఒకరికి బీ ఫారం ఇవ్వడం కాకుండా పోటీలో ఉండే ఒక అభ్యర్థిని బలపరచాలని భావిస్తోంది. -
టీచర్లకు థ్రిల్లర్ సినిమా!
- ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మండిపాటు అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీలు చేస్తారో, లేదో చెప్పకుండా ప్రభుత్వం టీచర్లకు థ్రిల్లర్ సినిమా చూపిస్తోందని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మండిపడ్డారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లోనే చేపట్టాల్సిన రేషనలైజేషన్, బదిలీలకు పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పూనుకోవడం వల్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. పోనీ షెడ్యూల్ ప్రకారమైనా ఈ ప్రక్రియను పూర్తి చేస్తోందా అంటే అదీ లేదన్నారు. ఇప్పటికి మూడు జీఓలు, 12 సవరణ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ప్రభావం పాఠశాలలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దశాబ్ధాలుగా పంచాయతీరాజ్ టీచర్లు ఎదురు చూస్తున్న ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంఈఓ, డీవైఈఓ, డైట్ అధ్యాపకులు, బీఈడీ కళాశాలల అధ్యాపకులు, ఎన్సీఆర్టీ, జేఎల్ పోస్టులు భర్తీ అవుతాయని, దీంట్లో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయమై మంగళవారం విద్యాశాఖ మంత్రి, కార్యదర్శిని కలిసి చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, రామన్న, ఏపీటీఎఫ్(1938) వెంకటసుబ్బయ్య, పండిత పరిషత్ ఎర్రిస్వామి, తులసిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం పెద్దన్న, యూటీఎఫ్ ఎస్వీవీ రమణయ్య, బీఈడీ ఉపాధ్యాయ సంఘం నారాయణస్వామి, పీఈటీ సంఘం లింగమయ్య, మోడల్ స్కూల్ టీచర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
టీచర్స్ ఎమ్మెల్సీ: టీఆర్ఎస్ జయకేతనం
-
టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి
- అర్ధరాత్రికి పూర్తయిన ఓట్ల లెక్కింపు - 11 రౌండ్ అనంతరం తేలిన ఫలితం - నేడు ధ్రువీకరణ పత్రం అందజేత సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా అధికార టీఆర్ఎస్ బలపరిచిన సిట్టింగ్ సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తిరిగి గెలుపొందారు. విజయానికి 9,670 ఓట్లు కావాల్సి ఉండగా, 11వ రౌండ్ పూర్తయ్యేప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో 9,734 ఓట్లు సాధించి నెగ్గారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చాక ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. గత ఎన్నికల్లో కూడా కాటేపల్లి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు! చీలిన ఓట్లు ఓట్ల లెక్కింపు సన్నాహాలు బుధవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైనా లెక్కింపు మధ్యాహ్నం తర్వాతే మొదలైంది. ఆసక్తికర మలుపుల మధ్య అర్ధరాత్రి 12 గంటల తర్వాత పూర్తయింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో కాటేపల్లికి మిగతా అందరికంటే ఎక్కువ ఓట్లొచ్చినా విజయానికి అవి చాలలేదు. తొలి రౌండ్లో ఆయనకు 7,640, మిగతా అభ్యర్థులందరికీ కలిపి 11,698 ఓట్లు లభించాయి. దాంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. వ్యతిరేక ఓట్లు చీలడం కాటేపల్లికి లాభించింది. ఈ నెల 9న జరిగిన పోలింగ్ ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో రద్దవడం, 19న రీ పోలింగ్ జరగడం తెలిసిందే. ఆ ఎన్నికలో 88.67 శాతం పోలింగ్ నమోదవగా, రీ పోలింగ్‌లో 82.49 శాతానికి పరిమితమైంది. ఓట్ల శాతం తగ్గడం ఎవరికి అనుకూలం కానుందనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ బలపరచిన కాటేపల్లికి ఇతరులు గట్టి పోటీనిచ్చారు. కానీ వారి ఓట్లు చీలడంతో ఎవరూ విజయానికి సమీపంగా రాలేకపోయారు. తొలి ప్రాధాన్యత ఓట్లను రెండు విడతలుగా లెక్కించారు. తొలి రౌండ్లో కాటేపల్లికి 7,640 ఓట్లు, ఏవీఎన్ రెడ్డి (ఎస్టీయూ)కి 3,091, పాపన్నగారి మాణిక్‌రెడ్డి (యూటీఎఫ్)కి 3,048 ఓట్లు లభించాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 2,482 ఓట్లు లభించాయి. తొలి పోలింగ్‌లో ఫొటో తారుమారైన అభ్యర్థుల్లో మాణిక్‌రెడ్డికి మూడో స్థానం లభించగా, ఆదిలక్ష్మయ్యకు కేవలం 461 ఓట్లు పడ్డాయి! అందరికంటే తక్కువగా అరకల కృష్ణాగౌడ్‌కు కేవలం 10 ఓట్లు రావడంతో రెండో రౌండ్లో ఆయనను తొలగించి మిగతా వారికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. చివరి రౌండ్ ముగిసేసమయానికి మాణిక్‌రెడ్డికి 5,095 ఓట్లు లభించాయి. చెల్లిన ఓట్లు: 19,338 విజయానికి కావాల్సిన ఓట్లు: 9,670 కాటేపల్లికి వచ్చిన ఓట్లు: 9,734 నేడు జనార్దన్‌రెడ్డి విజయోత్సవ సభ సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి విజయోత్సవ సభను గురువారం సిద్ధిపేటలో నిర్వహిస్తున్నట్లు పీఆర్టీ యూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులి సరోత్తంరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి తెలిపారు. -
నేడే రీ పోలింగ్
-
నేడే రీ పోలింగ్
► 8 జిల్లాల పరిధిలోని 126 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ► 22న ఓట్ల లెక్కింపు సాక్షి, హైదరాబాద్: ఆదివారం జరుగనున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రీ పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఆదిలక్ష్మయ్య, పాపాన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారవడంతో రీపోలింగ్ జరుపుతున్న విషయం తెలిసిందే. మరోసారి పొరపాట్లు జరగకుండా అన్ని అంశాలను అధికారులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. గుర్తింపు పత్రం లేనిదే ఎవరినీ పోలింగ్‌కు అనుమతించబోమని స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లను ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్‌కుమార్, రిటర్నింగ్ అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్ శనివారం స్వయంగా పరిశీలించారు. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీని, అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అంబర్‌పేట జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంకు మార్చ డంతో అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది శనివారం ఉదయం ఎన్నికల సామాగ్రితో కేంద్రాలకు వెళ్లారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 9న జరిగిన పోలింగ్ పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారి ఇచ్చిన వయొలెట్ స్కెచ్ పెన్‌తోనే ఓటర్లు బ్యాలట్ పేపర్‌పై ఓటు మార్క్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఓటేసేవారికి మధ్యవేలిపై సిరా గుర్తు వేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు కనీస సదుపాయాలు కల్పించామన్నారు. ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభ మవుతుంది. ఎనిమిది జిల్లాల పరిధిలోని 126 కేంద్రాల్లో పోలింగ్ జరుగనుంది. పోటీలోని అభ్యర్థులు.. కొంగర శ్రీనివాస్, అరకల కృష్ణాగౌడ్, ఆది లక్ష్మయ్య, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, గోపాల్ సాయిబాబా మీసాల, నర్రా భూపతిరెడ్డి, ఎంవీ నర్సింగ్ రావు, పాపన్నగారి మాణిక్‌రెడ్డి, ఎం. మమత, ఏవీఎన్ రెడ్డి, ఎస్. విజయకుమార్ -
బరి నుంచి తప్పించారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మహిళపై టీడీపీ మంత్రాంగం ఫలించింది. తీవ్రమైన ఒత్తిడి నడుమ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలచిన చదలవాడ సుచరిత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుకే మద్దతు అంటూ విచారవదనంతో తెలిపారు. పార్టీ అభ్యర్థిత్వం ఆశించి.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాని కి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత టీడీపీ మద్దతుతో పోటీకి దిగాలని భావించారు. టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో మూడు నెలల ముందు నుంచే ఆమె ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగట్టడానికి రంగంలోకి దిగారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలతో మూడు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం మద్దతు సంపాదించి మిత్రపక్షం కోటాలో బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఈ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో వాసుదేవనాయుడుని అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సుచరితను పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేసింది. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, సుచరిత భర్త చదలవాడ కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.శ్రీనివాసులుకు ఈ బాధ్యత అప్పగించారు. వ్యూహాత్మకంగా ముందడుగు తెలుగుదేశం అధిష్టానం వాసుదేవనాయుడుని అభ్యర్థిగా ప్రకటించడంతో ఒత్తిడి వస్తుందని ఊహించిన సుచరిత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. సుచరిత తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో నిలిచినా పెద్దగా ప్రభావం చూపలేరని తెలుగుదేశం నాయకులు మొదట భావించారు. అయితే ఈ స్థానానికి చతుర్ముఖ పోటీ నెలకొనడం, పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యంకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతు తెలపడం, ఏపీటీఎఫ్ నాయకుడు మాదాల వెంకటకృష్ణయ్య గట్టి పోటీ ఇస్తుండటంతో సుచరితను ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని తెలుగుదేశం నాయకత్వం నిర్ణయించింది. నాలుగు గంటల పాటు చర్చోపచర్చలు ఎన్నికల ఏర్పాట్లపై తన మద్దతుదారులతో చర్చించడానికి మంగళవారం నెల్లూరుకు వచ్చిన సుచరితను మంత్రి నారాయణ, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య కలిశారు. పోటీ నుంచి తప్పుకుని టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని ఆమె తొలుత తిరస్కరించారు. అధికారపార్టీపై తిరుగుబాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆమెను హెచ్చరించారని తెలిసింది. ఇప్పటికైనా మించిపోలేదని, పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి మద్దతిస్తున్న సంఘాలన్నీ టీడీపీ అభ్యర్థికి పనిచేయాలని పత్రికా ప్రకటన ఇవ్వాలని సుచరితకు వారు సూచించినట్లు సమాచారం. తాను మద్దతు అడిగితే ఏమాత్రం పట్టించుకోని పార్టీ నాయకత్వం చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవాలని ఎలా అడుగుతుందని సుచరిత మంత్రిని ఎదురు ప్రశ్నించారని తెలిసింది. తనకు మద్దతు ఇస్తున్న సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతానని సుతిమెత్తగా తిరస్కరించారని సమాచారం. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక గంటల కొద్దీ చర్చించినా వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో మంత్రి నారాయణ, వర్ల రామయ్య చివరకు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. చెప్పినట్లు వినకపోతే చదలవాడ విద్యాసంస్థలను మూసి వేయిస్తామని, రాజకీయంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు.. బరి నుంచి తప్పుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆగ్రహించినట్లు తెలిసింది. చంద్రబాబుకు ఫోన్ చేసి సుచరితతో మాట్లాడించినట్లు, చివరకు సుచరిత బరి నుంచి తప్పుకునేలా ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఎట్టకేలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తాను పోటీ నుంచి తప్పుకుని టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మంత్రి నారాయణ, వర్ల రామయ్యలతో కలిసి సుచరిత విచారవదనంతో విలేకరులకు తెలిపారు. -
సీమ అభివృద్ధికి కృషి
– వైఎస్ఆర్సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టరు కేవీ సుబ్బారెడ్డి ఆదోని టౌన్: తనను గెలిపిస్తే రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు. తనకు వచ్చే వేతనాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకే ఖర్చు చేస్తానని చెప్పారు. ఆదోని పట్టణంలో శనివారం పార్టీ శ్రేణులతో కలసి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. అమూల్యమైన ఓటు తనకే వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను గెలిపిస్తే సీమ అభివృద్ధి కోసం తన ఆస్తుల్లో రూ. పది కోట్లను ఖర్చు పెడతానని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో నిరుద్యోగ యువత, ఉద్యోగుల కోసం గెస్ట్ హౌస్‌లు ఏర్పాటు చేస్తానన్నారు. సాధారణ రోజుల్లో ఇవి కల్చరల్ సెంటర్లుగా పనిచేస్తాయన్నారు. సీమ వాసి అయిన సీఎం చంద్రబాబు నాయుడు.. రాయలసీమ గురించి ఢిల్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అన్నారు. తల్లి లాంటి సీమ కోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనుకాడబోనని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానన్నారు. ఏకీకృత రూల్స్, పీఆర్సీ, డీఎలు, అరియర్స్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. పాఠశాలల్లో బయో మెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పేరుకే ఉద్యోగుల హెల్త్ కార్డులని ఇస్తున్నారని, వర్సిటీల్లో పరిశోధనలు జరగడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, శేషిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవ, బీసీ సెల్‌పట్టణ అధ్యక్షుడు మహేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కల్లుబోతుల సురేష్, మండల కన్వీనరు విశ్వనాథ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
1998క్వాలిఫైడ్ టీచర్లు ఎమ్మెల్సీ బరిలోకి
వారి సమస్యలను వారే పరిష్కరించుకునే దిశగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ రానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1998క్వాలిఫైడ్ టీచర్లు బరిలోకి దిగుతున్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు మారినా తమ బతుకులు మారలేదని, తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడుగుపెడుతున్నామని వారు చెబుతున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్ : 1998లో రాష్ట్ర వ్యాప్తంగా 36,136 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. మొదటి లిస్టు ద్వారా 20వేల పోస్టులు, రెండో లిస్టు ద్వారా 5 వేల పోస్టులు భర్తీ చేశారు. అర్హత ఉన్నప్పటికీ మిగిలిన పోస్టులను భర్తీ చేయకపోవడంతో 11వేల మందికి పైగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్లు 18 ఏళ్లుగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో డీఎస్సీ-98 ద్వారా 1,827 పోస్టులకు గాను రెండు విడతల్లో 1,221 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన 606 పోస్టులు నేటికీ భర్తీ చేయలేదు. వీరందరూ ప్రభు త్వ కొలువు వస్తుందనే ఆశతో ఎదురుచూశారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రులు, మంత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సాంకేతిక కారణాలను సాకుగా చూపి సమస్య తీర్చలేదు. ఎన్నికల ముందు 1998 క్వాలిఫైడ్ టీచర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచాక వీరిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా 1998 క్వాలిఫైడ్ టీచర్లు బరిలోకి దిగుతున్నారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీ చేయనున్నట్లు వారు చెబుతున్నారు. ఎమ్మెల్సీగా గెలిస్తే.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే డీఎస్సీ-98, ఇతర డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్లకు ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పించడానికి కృషి చేస్తామని, పట్టభద్రులందరికీ ఉద్యోగం/స్వయంఉపాధి/నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెబుతున్నారు. రైతులకు సబ్సిడీ ద్వారా నాణ్యమైన విత్తనాలు ఇప్పించడంతో పాటు గిట్టుబాట ధర కల్పిస్తామని అంటున్నారు. మహిళలకు ప్రభుత్వ కొలువుల్లో 33.50శాతం రిజర్వేషన్, ప్రత్యేక ప్రతిభావంతులకు 3శాతం రిజర్వేషన్ కల్పించడానికి కృషి చేస్తామని పేర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసమే డీఎస్సీ-98లో అర్హత సాధించాం. అరుుతే మాలో కొందరికి ఉపాధ్యాయ పోస్టులివ్వలేదు. 18 ఏళ్లు నుంచి న్యాయపోరాటం చేసినా, ప్రజాప్రతినిధులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. మా సమస్యలను మేమే పరిష్కరించుకోవడం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాం. - ఎం.గోవిందరాజు, 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ ఏకమై గెలిపించాలి ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నారుు. ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు నీటి మూటలే అయ్యారుు. మన సమస్యల పరిష్కారం కోసం క్వాలిఫైడ్ టీచర్లు, నిరుద్యోగ పట్టభద్రులందరూ ఏకమై డీఎస్సీ-98 క్వాలిఫైడ్ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలి. -డి.ధర్మలింగారెడ్డి, 1998డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్