సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కొత్త వ్యూహం అమలుచేసే యోచనలో ఉంది. గత ఎన్నికలకు భిన్నంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని బరిలో దింపే విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రావడంలేదు. అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో ఎవరికీ బీఫారం ఇవ్వకుండా.. పోటీలో ఉండే వారి లో ఒకరిని బలపరచాలని భావిస్తోంది. టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కరికి టికెట్ ఇవ్వడం వల్ల మిగిలిన అభ్యర్థులను బలపరిచే సంఘాలు దూరమవుతాయని, దీనివల్ల లోక్‌స భ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది ఉంటుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఎమ్మెల్సీ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం నెలకొంటుందని యోచిస్తోంది.
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్... వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 5న నామినేషన్ల ప్రక్రియ ముగి యనుంది. 22న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి పాతూరి సుధాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి పూల రవీందర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది.
2013లో ఈ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పాతూరి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా, రవీందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం రవీందర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు వీరిద్దరు టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. వీరికి పోటీగా ఉపాధ్యాయ సంఘాల తరఫున పలువురు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఇలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. టీఆర్‌ఎస్ అవకాశమిచ్చి నా, ఇవ్వకున్నా పోటీలో ఉంటామని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇప్పటికే నిర్ణయించుకున్నా రు. దీంతో టీఆర్‌ఎస్ కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఎవరో ఒకరికి బీ ఫారం ఇవ్వడం కాకుండా పోటీలో ఉండే ఒక అభ్యర్థిని బలపరచాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment