ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత కలగలిపి తెలంగాణకే వన్నె తెచ్చేలా యాదాద్రిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధితోపాటు పరిసరాలను తీర్చిదిద్దటానికిగాను ఆలయ స్థపతి ఆనంద్‌సాయి, ఆర్కిటెక్ట్‌లు రాజు, జగన్‌లు రూపొందించిన ప్రణాళికలను సోమవారం సీఎం పరిశీలించారు