yadadri design
-
కూతురిని పొట్టన పెట్టుకున్నాడని.. నిందితుడిని కాల్చి చంపి..
సాక్షి, జవహర్‌నగర్/బీబీ నగర్: ఓ యువకుడిని ఎక్కడో దారుణంగా హత్య చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ శివారులో కాల్చేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పరిధిలోని డీజేఆర్ కాలనీ జోహర్‌నగర్ నివసిస్తున్న మోట రాము(35) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే కాలనీలో నివాసముంటున్న చీర వెంకటలక్ష్మి కుటుంబంతో గొడవలు ఉన్నాయి. కూతురు ఆత్మహత్యకు కారకుడయ్యాడని.. చీర వెంకటలక్ష్మి కూతురు భార్గవిని రాము కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాము వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన భార్గవి ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. తన కూతురు ఆత్మహత్యకు రాము వేధింపులే కారణమని వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు భరత్‌లు అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే రామును సోమవారం మేడ్చల్ పరిధిలోనే దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో వేసుకుని బీబీనగర్ మండలం రాయరావుపేట శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు. అనంతరం వెంకటలక్ష్మి, భరత్ నేరుగా ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రామును తామే హత్య చేసి కాల్చేశామని నేరం అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు రాయరావుపేట శివారులో రాము మృతదేహాన్ని గుర్తించారు. ఘటన స్థలాన్ని భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విష్ణు పుష్కరిణి.. విస్తరణ
యాదగిరికొండ : తిరుమల తరహాలో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా యాదగిరికొండపై ఉన్న విష్ణు పుష్కరిణిపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పుష్కరిణి విస్తరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.20కోట్లు కేటాయించారు. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం విష్ణు పుష్కరిణిని వెడల్పు చేయడంతో పాటు లోతు కూడా పెంచనున్నారు. ప్రస్తుతం పుష్కరిణి చుట్టూ సత్యనారాయణ వ్రత మండపం, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పుష్కరిణిలో స్నానమాచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విష్ణు పుష్కరిణి ప్రాశస్త్యం స్వామి సన్నిధికి వచ్చే భక్తుల్లో యాబై శాతం కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుష్కరిణిలోని ఓ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి గుంట ఉంది. అందులోనుం చి నిత్యం ఎడతెరిపి లేకుండా నీటిధార వస్తుంది. గతంలో చాలా పెద్ద దార వస్తుండేది. కాల క్రమేణా మరమ్మతుల నిమిత్తం పుష్కరిణిలో కాంక్రీటు వేయడం, కరువు పరిస్థితుల కారణంగా నీటి గుంట మూసుకుపోవడంతో పాటు జల దార కూడా తగ్గుముఖం పట్టింది. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే గ్ర హ, గృహ, ఈతి, రోగ బాధలు పోతాయ ని భక్తుల విశ్వాసం.అంతేకాకుండా ఈ కోనేరు నుంచి స్వామి వారికి అభిషేకానికి బందేతీర్థం తీసుకెళ్తుంటారు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి వెళ్తుంటారు. తిరుమలను తలపించేలా పుష్కరిణి విస్తరణ యాదగిరికొండపై ప్రస్తుతం ఉన్న పుష్కరిణి 36 మీటర్లు వెడల్పు, 18 మీటర్ల పొడవు ఉంది. ఇందులో భక్తుల కోసం నాలుగు స్నానపు గదులు, నాలుగు కుళాయిలు మాత్రమే ఉన్నాయి. ఇవి భక్తుల అవసరాలకు సరిపోవడం లేదు. కొత్తగా రానున్న పుష్కరిణి 55మీటర్ల వెడల్పు, 31మీటర్ల పొడవుతో రానుంది. అంతేకాకుండా భక్తులు స్నానమాచరించేందుకు విడివిడిగా సుమారు 20 స్నానపు గదులు నిర్మించనున్నారు. అలాగే పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరుగా గదులు, ప్రత్యేకంగా నీటి షవర్లు, విడిగా వేడినీటి షవర్లు ఏర్పాటు చేయనున్నారు. వికలాంగులు, చిన్న పిల్లలకు సైతం ప్రత్యేక గదులు రానున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. పుష్కరిణి మధ్యలో కల్యాణ మండపం, అందులో ప్రత్యేకంగా స్వామివారి పాదాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పాదాలపై ప్రతి భక్తుడు నీటిని పోసే విధంగా ప్రత్యేక క్యూలైన్లు రానున్నాయి. ఈ కల్యాణ మండపం చుట్టూ ప్రత్యేక గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.వీటితో పాటు పుష్కరిణికిలోనికి వెళ్లే ముందు 11అడుగుల ఎత్తులో అందమైన కమాను, దీనిపై ఐదు అడుగుల ఎత్తున్న విష్ణుమూర్తి విగ్రహం రానుందని అదికారులు తెలిపారు. చిన్నజీయర్ స్వామి సూచనల ప్రకారం పుష్కరిణి చుట్టూ గోడకు అందమైన శిల్పాలు రానున్నాయి. పది వేల మంది స్నానమాచరించేలా.. ప్రస్తుతం ఉన్న పుష్కరిణిలో రోజూ రెండు వేల మంది మాత్రమే స్నానమారచిండానికి వీలుగా ఉంది. దీన్ని పది వేల మంది సాన్నమాచరించేందుకు వీలుగా నిర్మాణం చేయనున్నారు. ప్రధానాలయ నిర్మాణం పూర్తయ్యేలోగా పుష్కరిణి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
తెలంగాణకు వన్నె తెచ్చేలా యాదాద్రి
-
తెలంగాణకు వన్నె తెచ్చేలా యాదాద్రి
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత కలగలిపి తెలంగాణకే వన్నె తెచ్చేలా యాదాద్రిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధితోపాటు పరిసరాలను తీర్చిదిద్దటానికిగాను ఆలయ స్థపతి ఆనంద్‌సాయి, ఆర్కిటెక్ట్‌లు రాజు, జగన్‌లు రూపొందించిన ప్రణాళికలను సోమవారం సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, ఆర్కిటెక్ట్‌లతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం క్యాంపు ఆఫీస్‌లో సమీక్షించారు. యాదగిరిగుట్టపై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన ఆలయప్రాంగణం, నాలుగు మాడవీధులు, నాలుగు రాజగోపురాలు, కాలి నడకమార్గం, భక్తుల క్యూ కాంప్లెక్సులు, బ్రహ్మోత్సవాల ప్రాంతం, ఈశాన్యంలో పుష్కరిణి విస్తరణ, తూర్పున శివాలయం, భారీ ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ప్రధాన ప్రవేశద్వారం, తదితర నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణం నాలుగువైపులా పాకశాల, అద్దాల మండపం, కల్యాణ మండపం తదితర నమూనాలను కూడా పరిశీలించారు. గతంలో సీఎం యాదాద్రికి వెళ్లిన సందర్భంలో చేసిన సూచనల ఆధారంగా ఈ నమూనాలను సిద్ధం చేశారు. ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కల్యాణకట్ట, దేవాలయానికి అభిముఖంగా దేవుడి వస్తువులు లభించే దుకాణాలు, మండల దీక్ష చేసే భక్తుల కోసం వసతి, బస గదుల నిర్మాణం ఉండాలని సీఎం సూచించారు. గర్భాలయం గుహలో కొలువైన మూలవిరాట్టు యథావిధిగా ఉండాలని, మిగిలిన ప్రాంతాల్లోనే ఆగమశాస్త్రానికి అనుకూలంగా అభివృద్ధి చేయాలన్నారు. గుట్టపై ఏకకాలంలో 30 వేలమంది భక్తులు కలియ దిరిగినా ఎలాంటి ఇబ్బంది లేనివిధంగా నిర్మాణాలుండాలని వివరించారు. భక్తులు సేదతీరేలా గుట్ట పరిసరాలను తీర్చిదిద్దాలని, ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా చుట్టూ ఉన్న ఇతర గుట్టలను కూడా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అతిథిగృహాలు, కాటేజీలు, సుందర వనాలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెళ్లేందుకు విడివిడి దారులు ఉండాలన్నారు. కింద రెండున్నర వేలమంది సామర్థ్యంతో కల్యాణ మండపం నిర్మించాలన్నారు. సమీపంలోని బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మారుస్తున్నట్టు వెల్లడించారు. దానికి అనుబంధంగా బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్కును నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టం ఏర్పాటు చేయాలని, నిత్యం పారాయణాలు వినిపించాలని సూచించారు. భక్తులకు మంచి నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.