కేసీఆర్ ను అంటే సహిస్తాను.. కానీ తెలంగాణను అంటే ఊరుకునేది లేదని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. నగరంలోని మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. హైదరాబాద్తో పోలిస్తే అమరావతి ఎంత.. ఆంధ్రా మేధావులు ఆలోచించండి అంటూ వారికి హితవు పలికారు. తెలంగాణకు సంస్కృతి, సంస్కారం ఉన్నాయని, తెలంగాణపై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నవ్యాంధ్రప్రధేశ్ రాజధాని అమరావతిని మంచిగా కట్టుకోండి.. అంతేకానీ దానిని హైదరాబాద్తో పోల్చడం ఎందుకు అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విమర్శిస్తే సాహితీలోకం తిప్పికొట్టాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అసూయ, భ్రమలు వీడి ప్రజలకు సేవ చేయాలని కేసీఆర్ హితవు పలికారు.