నోట్ల రద్దు నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ఢిల్లీ వీధుల్లో గురువారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, మూడ్రోజుల్లో నిర్ణయం ఉపసంహరించుకోకపోతే తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. నగదు లభ్యత వివరాలు చెప్పాలంటూ పార్లమెంట్ వీధిలోని ఆర్‌బీఐ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.