కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీవై రామయ్య శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామయ్యతో పాటు పలువురు నేతలు కూడా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.