gouru venkat reddy
-
మృగాళ్లకు మాండ్ర శివానందరెడ్డి అండ ..
సాక్షి, కర్నూలు సిటీ : బాధితుల పక్షాన నిలవాల్సిన పాలకులు.. నిందితులకే వత్తాసు పలుకుతున్నారు. అభం శుభం తెలియని గిరిజన బాలికపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా మృతికి కారణమైన వారిని కాపాడుతున్నారు. పోలీసులపై సైతం ఒత్తిళ్లు తెచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చివరకు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న టీడీపీ నేత వి.జనార్దన్‌రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చిత్రీకరించింది. అయితే.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ అధినేత కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్ శంకర్ (అసోసియేట్ ప్రొఫెసర్) 20 ఆగస్టు 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో సైతం అమ్మాయిని రేప్ చేసినట్లు నిర్ధా«రించారు. పెథాలజీ హెచ్ఓడీ డాక్టర్ జి.బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 21 ఆగస్టు 2017న నివేదిక ఇచ్చారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్లో కట్టమంచి స్కూల్ అధినేత వి.జనార్దన్‌రెడ్డి, కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు సెక్షన్ 302, 201, ఫోక్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సంఘటనపై విచారణకు కలెక్టర్ ముందుగా త్రి సభ్య కమిటీని, ఆ తరువాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి..హత్య చేశారని ఈ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. మృగాళ్లకు అండగా టీడీపీ నేతలు! ప్రీతి చదువులో అందరి కంటే ముందు ఉండేది. ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకొని చదివేది. స్కూల్లో 2017 ఆగస్టు 19న ఉదయం నిర్జీవంగా పడివుంది. మీ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని యాజమాన్యం ముందుగా సమాచారం ఇచ్చింది. అయితే..తల్లిదండ్రులు అక్కడికి పోయేసరికి నిర్జీవంగా పడివున్న కుమార్తెను చూసి గుండెలవిసేలా విలపించారు. అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాన్ని చూసి వారికి అనుమానం వచ్చింది. తమ బిడ్డను రేప్ చేసి చంపారంటూ అదే రోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. పోస్టుమార్టంలో సైతం ఇదే విషయం తేలింది. అయితే.. నిందితులను ప్రస్తుతం టీడీపీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి అప్పట్లో తన ఇంట్లోనే పెట్టుకొని కాపాడారు. అధికార బలంతో పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి.. కేసును సైతం పక్కదోవ పట్టించారు. తద్వారా నిందితులు అరెస్టయిన 23 రోజులకే బెయిల్ వచ్చేలా చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు మాండ్రతో పాటు టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి కూడా అడుగడుగునా ప్రయత్నించారని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు. కేసును విచారించిన పోలీసులు పోస్టుమార్టం సమయంలో సేకరించిన వాటిని హైదరాబాదులోని ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. రేప్లో ఎంత మంది పాల్గొన్నారో నిర్ధారించేందుకు టెస్ట్‌లు చేయించారు. అయితే..ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయించినట్లు విమర్శలున్నాయి. ఇదిలావుండగా.. కేసు విచారణకు పోస్టుమార్టం చేసిన వైద్యులు సహకరించడం లేదని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు పోలీసులు లేఖ రాశారు. దీంతో ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని నియమించాలని డీఎంఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఆదేశాలిచ్చింది. కమిటీ ఏర్పాటయ్యేలోపు ఫొరెన్సిక్ హెచ్ఓడీ ఇందులో జోక్యం చేసుకుంటూ తనను కూడా మెంబర్‌గా తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన వైద్యులు డాక్టర్ నీరజారెడ్డి, డా.షంషాద్ బేగంను సభ్యులుగా నియమిస్తూ, ఫొరెన్సిక్ హెచ్ఓడీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అయితే, సదరు హెచ్ఓడీ మాత్రం విద్యార్థిని ఉరి వేసుకున్నట్లు, రేప్ జరిగి ఉండకపోవచ్చన్న రీతిలో నివేదిక ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. వారి వినతి మేరకు కమిషన్ కేసును సీఐడీకి అప్పగించింది. మూడు రోజులు విచారణ చేసిన సీఐడీ అధికారులు పోస్టుమార్టం రిపోర్ట్‌లో ప్రీతికి సంబంధించిన కొన్ని ఫొటోలు పెట్టారనే కారణంతోనే డాక్టర్ శంకర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు. ఆ తరువాత తమకు న్యాయం చేయాలని హైకోర్టును అశ్రయించిన విద్యార్థిని తల్లిదండ్రులు సీబీఐ విచారణ కోరారు. ఫొరెన్సిక్ హెచ్ఓడీపై వైద్య, ఆరోగ్యశాఖ సెక్రటరీ, డీఎంఈలకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురు వైద్యులతో కమిటీ వేసి ఇటీవలే ఆ హెచ్ఓడీపై విచారణ కూడా పూర్తి చేశారు. హెచ్ఓడీ ప్రవర్తనపై వైద్యుల కమిటీ నివేదిక అందజేసింది. న్యాయం జరిగే వరకు పోరాటం కట్టమంచి స్కూల్లో 2017 ఆగస్టు 18వ తేదీ రాత్రి హాస్టల్ దగ్గర ఆ స్కూల్ యాజమాని కుమారులు మందు పార్టీ చేసుకున్నారు. అందులో పాల్గొన్న వారే మా కూతురును రేప్ చేశారని, ఇందులో టీడీపీ నేత వి.జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిల పాత్ర ఉందని కేసు పెట్టాం. ఆ రోజు నుంచి కేసు వెనక్కి తీసుకోవాలని చాలా మంది బెదిరిస్తున్నారు. మాలాగా మరో ఏ ఆడ పిల్ల తల్లిదండ్రులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో న్యాయం కోసం పోరాడుతున్నాం. నిందితులను కాపాడేందుకు నంద్యాల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి, ఆయన బంధువు గౌరు వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ అండతో అన్ని సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలి. అఘాయిత్యాలు చేసే వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలి. – రాజునాయక్, పార్వతిదేవి (ప్రీతి తల్లిదండ్రులు) -
వైఎస్సార్ సీపీలోకి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
-
వైఎస్సార్ సీపీలోకి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
హైదరాబాద్: కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీవై రామయ్య శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామయ్యతో పాటు పలువురు నేతలు కూడా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ... జనమంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్సార్ సీపీలో చేరారని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా జనం మత్రం జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని గౌరు వెంకటరెడ్డి అన్నారు. రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ సీపీదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. -
'అవినీతి సొమ్ముతో బాబు ఎమ్మెల్యేలను కొంటున్నారు'
కర్నూలు : అవినీతి సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్, ఐజయ్య, గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం కర్నూలులో వారు విలేకర్లతో మాట్లాడుతూ... కొందరు స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. -
జగనన్నను ముఖ్యమంత్రి చేద్దాం
వైఎస్ సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కల్లూరు, న్యూస్‌లైన్: జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుని వైఎస్ సువర్ణ యుగాన్ని తెచ్చుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం 23వ వార్డు టెలికాం నగర్, నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతాల్లో గౌరు వెంకటరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి నిలబడ్డారని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీతోనే సంక్షేమం సాధ్యమని వివరించారు. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్, టీడీపీలను నమ్మవద్దన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని చెప్పారు. ఇంటింటి ప్రచారం: 30వ వార్డు సాయినగర్, స్వామినగర్, రాఘవేంద్రనగర్, రామ్హ్రీమ్ నగర్లలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సిటీ కన్వీనర్ అడ్వకేట్ కర్నాటి పుల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు ఏసురత్నం, అశోక్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జననేతను ముఖ్యమంత్రి చేద్దాం
వైఎస్సార్సీపీతో అభివృద్ధి సాధ్యం చంద్రబాబు పాలనను కోరుకోవద్దు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి షర్మిల రోడ్‌షోలో గౌరు వెంకటరెడ్డి కల్లూరు, న్యూస్‌లైన్: జననేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక చెన్నమ్మ సర్కిల్ వద్ద సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రోడ్‌షో నిర్వహించారు. ఈ సదర్భంగా గౌరు వెంకటరెడ్డితోపాటు ఆ పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రసంగించారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమైందన్నారు. ఆ మహానేత ఆశయాలను సాధించేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తే కరువు విలయతాండవం చేసిందని గుర్తుచేశారు. వ్యవసాయం దండగన్న బాబు.. ఎన్నికల సమయంలో రైతులపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనను మళ్లీ కోరుకోవద్దని సూచించారు. ఎంపీ ఎస్పీ వై రెడ్డి మాట్లాడుతూ... రైతుల గురించి టీడీపీ అధినేత ఏనాడు పట్టించుకోలేదన్నారు. అన్నదాతల సంక్షేమం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతులకు పగటి పూట ఏడు గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందుతుందని, అలాగే ధరల స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లతో నిధి ఏర్పాటు అవుతుందన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఐదు సంతకాలతో రాష్ట్ర దిశను మార్చివేస్తారని గౌరు చరితారెడ్డి అన్నారు. అమ్మ ఒడి పథకం, డ్వాక్రా రుణాల మాఫీ.. మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వివరించారు. వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ చంద్రకళాదరరెడ్డి, కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: గౌరు
డోన్‌టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిన్నకేశవయ్యగౌడ్, ఆయన సతీమణి మాజీ కౌన్సిలర్ టీఈ లక్ష్మీదేవితో పాటు మరో 500 మంది మంగళవారం డోన్ నియోజకవర్గ ఇన్చార్జి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కేశవయ్యగౌడ్ దంపతులకు కండువాలు కప్పి గౌరు వెంకటరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనం గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నత స్థానం ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు గల్లంతవడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశవాదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన పాపం టీడీపీదేనని విమర్శించారు. కార్యక్రమంలో ఏపీఐడీసీ మాజీ డెరైక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డి, జిల్లా కో కన్వీనర్ శ్రీరాములు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వలసల రామక్రిష్ణ, రాచర్ల రాందాసుయాదవ్, రామక్రిష్ణారెడ్డి, న్యాయవాది నర్శింహులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో రమేష్‌గౌడ్, దినేష్‌గౌడ్, రవిశంకర్‌గౌడ్, నాగార్జునగౌడ్, సతీష్‌గౌడ్, మహేష్, చాంద్‌బాషా, భాస్కర్, మల్కన్న, నాగన్న, పెద్ద కాశీం, వీరాంజనేయులు, వెంకటేశు తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీలోకి ఆర్ఈ రాజవర్ధన్, మాజీ కౌన్సిలర్ సరళమ్మ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆర్ఈ రవికుమార్ సతీమణి, మాజీ కౌన్సిలర్ ఆర్ఈ సరళమ్మ, ఆమె తనయుడు ఆర్ఈ రాజవర్ధన్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. స్థానిక పాతపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరితో పాటు 500 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఆర్ఈ రాజశేఖర్, ఆర్ఈ రామ్మోహన్, పోస్టుప్రసాద్, మాజీ కౌన్సిలర్ బుర్రు చంద్రశేఖర్‌నాయుడు, ఫరీద్, నాయుడు, శివ తదితరులు ఉన్నారు. -
రాష్ట్రాన్ని కాపాడుకుందాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యశంఖారావం సభ సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించారు. పార్టీ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభకు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మిగనూరు/టౌన్, న్యూస్లైన్ః సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలోని తేరుబజార్‌లో సమైక్య శంఖారావం సభ జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం వెలువడిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకున్న కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు సీమాంధ్రకు ఆదర్శంగా నిలిచారన్నారు. 135 రోజులుగా అన్ని వర్గాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించడం అభినందనీయమన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెడుతూ ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు సమైక్యాంధ్ర తీర్మానానికి ముందుకు వస్తారని సూచించారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రగా పనిచేసి వేలాది కోట్లను దండుకున్న చంద్రబాబునాయుడు సీబీఐ దర్యాప్తు జరగకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని విమర్శించా రు. కేసులుకు భయపడే రాష్ట్రాన్ని గాలికివదిలేశారన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ మాట తప్పక.. మడమ తిప్పక రాష్ట్రం కోసం పోరాడుతున్న తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రం విడిపోతే ఒక్క రాజధానిలోనే ఆరు లక్షల ఉద్యోగాలను సీమాంధ్రులు కోల్పోతారని, జలవివాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం మొట్టమొదట రాజీనామాలు సమర్పించి, నేటికీ సమైక్య తీర్మానం కోసం పట్టుపడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌నే అన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ లేకపోవడంతో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దశాబ్దాలుగా డీలాపడిపోయిన కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ అధికారంలోకి తీసుకొస్తే, అదే పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుండటం విచారకరమన్నారు. విభజన ప్రక్రియను ఆపాలని తమ అధినేత దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతూ సమైక్యాంధ్రకు అనుకూలంగా చర్చజరిగేలా ప్రయత్నాలు చేపట్టి విజయవంతమైయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీ మహిళ, చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుకమ్మను ప్రతి ఒక్కరూ ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. మున్సిపల్ మాజీ చెర్మైన్ బుట్టా రంగయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బీఆర్.బసిరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చెర్మైన్ రమాకాంత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాచాని శివకుమార్, మైనార్టీ నాయకులు హాజీ నద్దిముల్లా, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు లింగమూర్తిలు సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బుట్టా నీలకంఠప్ప, మాచాని నాగరాజు, నందవరం సంపత్‌కుమార్‌గౌడ్, లక్ష్మికాంత్‌రెడ్డి, నసిరుద్దీన్, కాశీవిశ్వనాథ్‌రెడ్డి, గోవిందు, భీమిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ధర్మకారి నాగేశ్వరరావు, ఇంజనీర్ రాజన్న, సునీల్‌కుమార్, రియాజ్‌అహ్మద్, రాజారత్నం పాల్గొన్నారు. బడుగు మహిళను.. మీ ఆడపడుచును బడుగు మహిళను.. మీ ఆడపడుచును.. ఆదరించండి.. జగనన్న ఆశయాల్లో నన్ను పాలుపంచుకోనివ్వండి’ అంటూ వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక సభలో ప్రసంగించడం పలువురిని ఆకట్టుకుంది. చేనేత వర్గానికి చెందిన ఓ మహిళను కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళాసాధికారితకు పెద్దపీట వేశారన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టత కోసం పాటుపడుతానని ఆమె పేర్కొన్నారు. మహానేత వైఎస్ఆర్ చేనేతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, జననేత కూడా చేనేతల అభివృద్ధికి శ్రమిస్తారన్నారు.