జగనన్నను ముఖ్యమంత్రి చేద్దాం
- వైఎస్ సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం
- వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కల్లూరు, న్యూస్‌లైన్: జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుని వైఎస్ సువర్ణ యుగాన్ని తెచ్చుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం 23వ వార్డు టెలికాం నగర్, నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతాల్లో గౌరు వెంకటరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి నిలబడ్డారని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీతోనే సంక్షేమం సాధ్యమని వివరించారు. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్, టీడీపీలను నమ్మవద్దన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని చెప్పారు.
ఇంటింటి ప్రచారం: 30వ వార్డు సాయినగర్, స్వామినగర్, రాఘవేంద్రనగర్, రామ్హ్రీమ్ నగర్లలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సిటీ కన్వీనర్ అడ్వకేట్ కర్నాటి పుల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు ఏసురత్నం, అశోక్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.