నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన భార్య లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. నందమూరి వంశాన్ని టీడీపీకి దూరం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనతో రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. మళ్లీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా బాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజధానికి 30 వేల ఎకరాలు సేకరించానని చెబుతున్నా.. అందులో 17 వేల ఎకరాలు కూడా లేవని ఆమె మండిపడ్డారు.