laxmiparvathi
-
‘ఎన్టీఆర్‌ను నిజంగా అభిమానిస్తే అలా ఎందుకు చేశావ్’
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీకాంత్ కూడా ఆయనకి సహకరించారని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా వైస్రాయ్ హోటల్‌కి వచ్చేలా చేసి తర్వాత వారందరినీ తనకనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ బతికుండగానే ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆ కార్యక్రమానికి రజనీకాంత్ పూర్తిగా సహకరించారని చెప్పారు. ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా వైస్రాయ్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి రజనీకాంత్ మద్రాసు నుంచి వచ్చి మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను నిజంగా అభిమానించి ఉంటే రజనీకాంత్.. చంద్రబాబుకు సహకరించాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా కేవలం చంద్రబాబు కోసమే అప్పటి కుట్రలో పాలుపంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా తీవ్రమైన ఆవేదనలో ఉన్న ఎన్టీఆర్‌ను మరింత ఆవేదనకు గురయ్యేలా చేశారన్నారు. చంద్రబాబు దొడ్డిదారిలో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అప్పుడు ఆయనకు ఉపయోగపడిన రజనీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి పేరుతో పెనమలూరు మండలంలో నిర్వహించిన సభలో మళ్లీ చంద్రబాబుకు మద్దతు పలుకుతూ భజనచేశారని చెప్పారు. రజనీకాంత్ అప్పుడూ ఇప్పుడూ కూడా ఎన్టీఆర్ మనోభావాలను గౌరవించలేదని, ఎప్పుడూ చంద్రబాబు కోసమే పనిచేశారని ఆమె పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ కంటే చంద్రబాబు భజనే ఎక్కువైంది! -
చంద్రబాబును నమ్మిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదు..
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడుని నమ్మిన ఏ ఒక్కరు కూడా బాగు పడినట్లు చరిత్రలో లేదని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు అడుగులకు మడుగులు నొక్కుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పరిస్థితి కూడా అంతేనన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లోనై నిమ్మగడ్డ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా ఎలా ప్రవర్తిస్తాడో చెప్పటానికి నిమ్మగడ్డ ఓ ఉదాహరణ అన్నారు. నిమ్మగడ్డ తీరును అందరూ వ్యతిరేకిస్తున్నా, ఆయనలో ఏమాత్రం చలనం లేదని.. ఆయన చంద్రబాబు మైకంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సకల పాపాలకు కేంద్ర బిందువైన చంద్రబాబు మాటలను ఒక ఐఏఎస్ చదివిన వ్యక్తి ఎలా నమ్ముతున్నాడో అర్ధం కావట్లేదన్నారు. గాంధీ తర్వాత గ్రామ స్వరాజ్యానికి కోరుకున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి మాత్రమేనని, ఆయన ఏడాదిన్నర పాలనే ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తుంటే, కొన్ని అరాచక శక్తులు అందుకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కరోనా క్లిష్ట సమయాల్లో కూడా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తుంటే, చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని జూమ్ యాప్ ద్వారా కార్యకర్తలను రెచ్చగొడుతూ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే చంద్రబాబు విగ్రహలను ధ్వంసం చేయిస్తున్నాడని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నాడని, త్వరలో ఆయన తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఆమె జోస్యం చెప్పాడు. కాగా, తెలుగు అకాడమీ ప్రధాన కార్యాలయం త్వరలో తిరుపతి నుండి కార్యకలాపాలు సాగించనుందని, ఇప్పటికే తిరుపతిలో ఆఫీస్, పుస్తకాలు భద్రపరిచే గోడౌన్ వసతులు సమకూరాయని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికంతా ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పట్టించుకోలేదని, సీఎం జగన్ తెలుగు అకాడమీపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వం సంస్కృత అకాడమీని ప్రారంభించనుందని ఆమె తెలిపారు. -
‘ఎన్టీఆర్ పంచె లాక్కెళ్లి రాహుల్ గాంధీకి కప్పారు’
సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నటుడు పృథ్వీ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ పంచె లాక్కెళ్లి చంద్రబాబు రాహుల్ గాంధీకి కప్పారని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం నందమూరి సుహాసినిని బాబు బలిపశువుని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ గాలి 30 ఏళ్ల పాటు ప్రజలకు అందాలని ఆకాక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘మా అధినేత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు జాతి గర్వించే నాయకుడు వైఎస్ జగన్. ఆయనను త్వరలో సీఎంగా చూడబోతున్నాం. వైఎస్ జగన్‌ను రాష్ట్ర భవిష్యత్‌గా ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఆయనకు దుర్గాదేవి ఆశీస్సులు ఉంటాయ’ని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. కృష్ణా జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మెహబూబ్ షేక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కంటి, షుగర్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 47 కిలోల భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరారు. పార్టీ ముఖ్య నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, విజయచందర్, గౌతమ్ రెడ్డి, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, అడపా శేషు, ఎంవీఆర్ చౌదరి, తోట శ్రీనివాస్, కాలే పుల్లారావు, వెంకటేశ్వర శర్మ, అవుతు శ్రీనివాస్ రెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, ఆసిఫ్ వేడుకల్లో పాల్గొన్నారు. -
నటుడు చలపతిరావుకు అక్కినేని అవార్డు
వివేక్‌నగర్: తెలుగు చలనచిత్ర రంగంలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక శైలిని చాటుకున్న చలపతిరావు స్వయం కృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన మనసున్న మంచి మనిషి అని రచయిత్రి డా.నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం త్యాగరాయ గానసభలో జరిగిన అక్కినేని గీతామృత వర్షిణి, అక్కినేని విశిష్ఠ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాలుగు తరాల నటులతో నటించే అరుదైన అవకాశం చలపతి రావుకు దక్కిందన్నారు. ఆయన క్రమశిక్షణ నేటి యువ నటులకు ఆదర్శమన్నారు. డా.ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ స్వర్గీయ ఎన్.టి.ఆర్కు అత్యంత సన్నిహితులైన చలపతిరావు విలన్‌గా, కారెక్టర్ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. అనంతరం చలపతిరావును అక్కినేని విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డా.కె.వి.కృష్ణకుమారి, జె.నారాయణ రావు, డా.విజయలక్ష్మి, రవికుమార్, యస్.యన్.సుధారాణి, పురస్కార గ్రహీత చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
'కోట్లు ఖర్చుపెట్టి.. లోకేష్ ఏం సాధించాడు'
-
'కోట్లు ఖర్చుపెట్టి.. లోకేష్ ఏం సాధించాడు'
హైదరాబాద్: నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన భార్య లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. నందమూరి వంశాన్ని టీడీపీకి దూరం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనతో రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. మళ్లీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా బాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజధానికి 30 వేల ఎకరాలు సేకరించానని చెబుతున్నా.. అందులో 17 వేల ఎకరాలు కూడా లేవని ఆమె మండిపడ్డారు. రాజధాని పేరుతో 10 వేల ఎకరాలు సింగపూర్ కు ధారదత్తం చేసి రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నారని బాబుపై విమర్శలు గుప్పించారు. ఎలాంటి అవగాహన లేని లోకేష్ ను ప్రమోట్ చేయడానికి బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ఏ హోదాలో అమెరికాలో పర్యటించారని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి లోకేష్ సాధించిందేమిటని ఆమె ప్రశ్నించారు.