కింగ్ ఫిషర్ ఎరుుర్‌లైన్‌స పేరిట విజయ్‌మాల్యా తీసుకున్న రూ.1,200 కోట్ల రుణంతో సహా దాదాపు 63 మంది డిఫాల్టర్లకు చెందిన రూ.7,000 కోట్ల రుణాల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ‘రైటాఫ్’ చేసిందంటూ వచ్చిన వార్తలు బుధవారం పార్లమెంటులో దుమారం రేపారుు. బ్లాక్ మనీ ఏరివేతకంటూ ప్రధాని మోదీ చేసిన నోట్ల రద్దు ప్రకటనతో ఇప్పటికే జనం చేతిలో వెరుు్య, రెండువేలు పట్టుకుని బ్యాంకుల ముందు పడిగాపులు గాస్తున్నారు. ఏటీఎంలు పనిచేయక, పనిచేసే కొద్ది ఏటీఎంల ముందు లైన్లో నిల్చోలేక నానా యాతనా పడుతున్నారు.