భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ)కు ఓ సఫాయ్ వాలా దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. రూ.7వేల కోట్ల మొండి బకాయిలను ఎస్బీఐ రద్దు చేస్తున్నట్లు వచ్చిన రిపోర్టులపై స్పందించిన సఫాయ్ వాలా తన రుణాన్ని కూడా రద్దు చేయాలని ఎస్బీఐకు లేఖ రాశాడు. నాసిక్ త్రయంబకేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ లో భావూరావు సోనవానే సఫాయ్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. విజయ్ మాల్యాకు రుణాన్ని మాఫీ చేసిన చేత్తోనే తన రూ.1.5లక్షల రద్దు చేయాలని కోరాడు.