సమైక్యాంధ్ర, 2-జీ స్కాంపై జేపీసీ నివేదిక, ధరల పెరుగుదల, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితుల సహాయ శిబిరాల్లో పిల్లల మరణాలు, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల సమస్యలపై విపక్షాలన్నీ పెద్దపెట్టున ఆందోళనకు దిగటంతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే వాయిదాపడ్డాయి. ఫలితంగా యూపీఏ సర్కారుపై.. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు ఆరుగురితో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు కేవలం ప్రస్తావనకే పరిమితమయ్యాయి.