ఊహించినట్టుగానే టీటీడీపీ నేతల భేటీ హాట్‌హాట్‌గా సాగింది. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రేవంత్ వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావిస్తున్న రేవంత్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్ గౌడ్ మండిపడ్డట్టు సమాచారం.