అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా.. తమ జాతి (బలిజ, తెలగ, కాపుల)కి బీసీ రిజర్వేషన్ ఇస్తానన్న హామీని చంద్రబాబునాయుడు నిలబెట్టుకోలేదని, ఈ విషయంలో తాము ఇంకా ఎన్నాళ్లు నిరీక్షించాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ఆదివారం లేఖ రాశారు.