సాక్షి, కిర్లంపూడి: ప్రత్యేక హోదా ఎలాంటి హామీనో.. కాపులను బీసీల్లో చేర్చడం కూడా అలాంటి వాగ్దానమేనని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.