ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరితీయొద్దంటూ ట్వీట్లు చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై ఆయన తండ్రి సలీం ఖాన్ మండిపడ్డారు. 257 మంది ప్రాణాలు కోల్పోయిన నాటి ఘటన గురించి సల్మాన్కు ఏమాత్రం అవగాహన లేదని.. ట్విట్టర్లో అతని రాతలన్నీ అర్థరహితమైనవని, తెలివితక్కువతనాన్ని బయటపెట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివారం మద్యహ్నం తన అభిప్రాయాన్ని మీడియాకు తెలియజేసిన సలీం ఖాన్.. యాకూబ్ ఉరితీత విషయంలో మాత్రం కొడుకుతో ఏకీభవించాడు. 'యాకూబ్ దోషే అయినప్పటికీ ఉరి విధించకుండా అతడ్ని జీవితాంతం జైలులో ఉచడమే సరైన శిక్ష' అని సలీం అన్నారు