ప్రధాని కేపీ ఓలి సారథ్యంలోని నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. భాగస్వామి పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ప్రధాన విపక్షం నేపాలీ కాంగ్రెస్(ఎన్‌సీ) మద్దతుతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.