ఏటీఎం, పేటీఎంలకు ప్రాతినిధ్యం తగ్గనుంది. చెల్లింపులకోసం ఉపయోగించే ఇతర ప్రైవేటు యాప్‌లకు కూడా కేంద్రం తీసుకొస్తున్న కొత్త యాప్‌తో షాక్ గా మారనుంది. నగదురహిత లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన 'ఆధార్ పేమెంట్ యాప్' రేపు (డిసెంబర్ 25)న ప్రారంభించబోతున్నారు. నోట్ల రద్దు తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకోవడం డిజిటల్ చెల్లింపుల పై పలు విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ యాప్ అందుబాటులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.