గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో కీలక చర్యల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నయీమ్‌తో అంటకాగిన పోలీసు అధికారులపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొంత మంది నేతలు, పోలీసు అధికారుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందన్న ఆరోపణలకు చెక్‌పెట్టడంతో పాటు నేరాలు, నేరస్తులపై ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు తీసుకుంటుందన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో నాలుగు నెలలుగా సిట్ అధికారులు చేసిన దర్యాప్తు, అధికారుల విచారణకు కూడా లైన్ క్లియరైనట్లు అభిప్రాయపడుతున్నాయి.