ఒలింపిక్స్ లో చరిత్రాత్మక ఘనత సాధించిన పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో తృటిలో స్వర్ణం చేజార్చుకుని రజిత పతకం సాధించిన సింధును రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పలు పార్టీల ముఖ్యనేతలు, సినీ తారలు పొడగ్తలతో ముంచేశారు.