కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధూ దర్శించుకున్నారు. కోచ్ గోపిచంద్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి ఆమె తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సింధు, ఆమె కుటుంబసభ్యులు సహా కోచ్ గోపీచంద్ స్వామి రిని దర్శించుకున్నారు.