రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ బ్యాంకులు శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. రద్దయిన నోట్ల డిపాజిట్లకు సంబంధించి మొత్తం వివరాలు అందించాల్సిందిగా కోరింది. గడువు ముగియనున్న డిసెంబర్ 30వ తేదీతో సహా బ్యాంకు ఖాతాల్లో జమ అయిన పాత నోట్ల వివరాలను సమర్పించాలని బ్యాంకులను ఈ మెయిల్ ద్వారా ఆదేశించింది.