రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లలోకోత పెట్టింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన డెబ్యూ పాలసీ సమీక్షలో లో కీలక రెపో రేటులో కోత పెట్టారు. రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 25 బేసిస్ పాయింట్లను తగ్గించారు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతంనుంచి 6.25 గా నిర్ణయించారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ కు తన మొట్టమొదటి పాలసీ రివ్యూలో మ్యాజిక్ చేశారు. మంగళవారం ప్రకటించిన ద్రవ్యపరపతి విధానం సమీక్ష తో వడ్డీ రేట్లు ఆరేళ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి.