విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సోమవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతోంది. కాగా తెలంగాణపై నేడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు హస్తిన బాట పడుతున్నారు. ఆంటోనీ కమిటీతో సమావేశమై తమ వాదనలు వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా మూడు రోజుల విరామం అనంతరం పార్లమెంట్ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు లోక్సభలో ఆహార భద్రత బిల్లుపై చర్చ జరగనుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ సభ్యులకు విప్ జారీ చేసింది.
Published Mon, Aug 12 2013 11:10 AM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement