జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కు సీమాంధ్రలోనూ నిరసన సెగలు తప్పడం లేదు. పార్టీ స్థాపించిన అనంతరం బీజేపీ-టీడీపీల రంగును ఒంటికి రాసుకున్న పవన్ కు అటు అభిమానుల్ని నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీ-బీజేపీల కూటమి ఏ రకంగా మద్దతు తెలుపుతారంటూ ఈ రోజు బెంజ్ సర్కిల్ లో సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పవన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Published Fri, May 2 2014 4:19 PM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement