జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా ప్రాంతంలో తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనికులు అమరులయ్యారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో ఆర్మీ యూనిట్ లోకి ప్రవేశించిన ముగ్గురు తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు