గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తునకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మోకాలడ్డుతున్నారా...? ఉమ్మడి ఏపీకి తాను సీఎంగా ఉన్న సమయంలో పనిచేసిన కొందరు అధికారులను, తన పార్టీకి చెందిన కొందరు నేతలను కాపాడుకునే యత్నం చేస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారా? ఒకట్రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి!