ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న ప్రైవేటుబస్సు నాయకన్ గూడెం వద్ద నాగార్జున సాగర్ (ఎన్ఎస్పీ) కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.