దేశంలోని ప్రతి యూనివర్సిటీ కూడా ఓ స్టార్టప్, ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు సిద్ధం కావాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది. యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టాలని సూచిం చింది. పారిశ్రామిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా, ఉత్తమ ఉత్పత్తులకు తోడ్పడేలా పరిశోధనలు చేపట్టాలని స్పష్టం చేసింది.