ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎంపికలో ఇప్పటి వరకు జరిగిన జాప్యానికి తెరదించింది. మొత్తం పన్నెండు స్ధానాల్లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అన్నం సతీష్ ను ఖరారు చేశారు. ఇక్కడ రెండు ఎమ్మెల్సీలకు ఒక్కరినే ప్రకటించడం విశేషం.