సుప్రసిద్ధ సాహితీవేత్త చేకూరి రామారావు(80) కన్నుమూశారు. ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త ఒరవడి సృష్టించిన ఆయన 'చేరా' పేరుతో ప్రసిద్దులు. భాషాశాస్త్ర పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా ఖ్యాతి గడించారు. 1934 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లందలపాడులో ఆయన జన్మించారు. అమెరికా కార్నెల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.