గత ఏడు రోజులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బలవంతంగా నిమ్స్ వైద్యలు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. జగన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో 151 గంటలుగా ఆయన చేస్తున్న దీక్షను వైద్యులు బలవంతంగా భగ్నం చేశారు. ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుందని, ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని నిమ్స్ డాక్టర్ల ప్యానెల్ ఇచ్చిన సమాచారానికి చంచల్గైడ జైలు అధికారులు స్పందించారు. సెక్షన్ 593 నిబంధన ప్రకారం బలవంతంగానైనా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిందిగా నిమ్స్ డాక్టర్లకు అనుమతి ఇచ్చారు. దానితో ఆ విషయాన్ని చెప్పి డాక్టర్లు బలవంతంగా జగన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అయితే జగన్ పూర్తిగా తేరుకోవడానికి మరికొన్ని రోజులపాటు చికిత్స అవసరమని డాక్టర్లు వెల్లడించారు. నిమ్స్ డైరెక్టర్‌కు జైలు అధికారుల లేఖ పంపారు. జైలు నిబంధల ప్రకారం బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 590 నిబంధన ప్రకారం అత్యవసర చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము జైలు అధికారుల ఆదేశాలను పాటిస్తామని నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్లూయిడ్స్ ఎక్కించిన తర్వాత కనీసం నాలుగు రోజులు చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు.