అమెరికా అధ‍్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ఆర్డర్‌పై చేసిన సంతకం దేశీయ ఐటీ సంస్థల్లో గుబులు రేపింది. భారత ఐటీ రంగానికి మరోసారి భారీ షాకిస్తూ హైర్ అమెరికన్స్ అంటూ మొదటనుంచి చెబుతున్న ట్రంప్ దేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్1బీ వీసా నిబంధనల మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ సంతకం చేశారు.